: సినీ తారలు, నేతల వల్లే నిరర్ధక ఆస్తులు పెరిగిపోతున్నాయి: ఆంధ్రాబ్యాంకు సీఎండీ


సినీ తారలు, రాజకీయ నాయకుల కారణంగా తమ బ్యాంకులో నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏలు) పెరిగిపోయాయని ఆంధ్రాబ్యాంకు సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికం (క్యూ3) ఫలితాలు వెల్లడించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలను చెల్లించాలని సూచించారు. లేని పక్షంలో రైతులు తనఖా పెట్టిన బంగారాన్ని వేలం వేస్తామని ఆయన హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో రైతు రుణమాఫీపై ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధి బయటపడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News