: రాజీనామాకు ముందే అమిత్ షాతో జయంతి నటరాజన్ చర్చలు!
రాహుల్ గాంధీ పై తీవ్రమైన ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో అమిత్ షాతో జయంతి నటరాజన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. కాగా, ఈ వార్తలను బీజేపీ ఖండించింది. ఆమెతో తమ పార్టీ నేతలు ఎటువంటి చర్చలు జరపలేదని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.