: పెళ్లి ప్రపోజల్ విని ఎగిరి గంతేసింది... ప్రాణాలు కోల్పోయింది!
ప్రేమించాక పెళ్లి ప్రపోజల్ మామూలే! బల్గేరియాకు చెందిన ఈ యువకుడూ అలానే చేశాడు. కానీ, అది విషాదాంతం అయింది. వివరాల్లోకెళితే... సదరు యువకుడు దిమిత్రినా దిమిత్రోవా అనే యువతిని ప్రేమించాడు. కొంతకాలం ఎంజాయ్ చేసిన తర్వాత ప్రియురాలిని పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు తన మనసులో మాటను దిమిత్రోవాకు చెప్పాలని భావించి, ఆమెను ఆహ్వానించాడు. ఇద్దరూ కలిసి ఓ కొండపైకి నడిచారు. అక్కడ తన ప్రియురాలికి విషయం చెప్పేశాడు. "అనుమతిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటా" అని చెప్పడంతో ఆమె ఆనందంతో ఎగిరి గంతేసింది. అయితే, వారున్నది కొండ అంచున కావడంతో దిమిత్రోవా అదుపుతప్పి కిందికి పడిపోయింది. దీంతో, తీవ్రగాయాలపాలై మృతి చెందింది.