: ఏడేళ్ల తరువాత... మరో నవల రాస్తున్న సల్మాన్ రష్దీ
ప్రఖ్యాత బ్రిటీష్-ఇండియన్ రచయిత సల్మాన్ రష్దీ ఏడేళ్ల విరామం తరువాత మరో నవల రాయడం ప్రారంభించారు. ఈ కొత్త రచన సెప్టెంబరులో ప్రచురితమవుతుందని సమాచారం. దీని పేరు 'టూ ఇయర్స్ ఎయిట్ మంత్స్ అండ్ ట్వంటీ ఎయిట్ నైట్స్'. పేరు మాత్రం పెద్దగా ఉన్నా, నవల చిన్నదేనని రష్దీ చెబుతున్నారు. కాగా, తన రెండో నవల 'మిడ్‌నైట్ చిల్డ్రన్'తో బుకర్ బహుమతి గెలుచుకున్న ఆయన ఆ తర్వాత 'శాటానిక్ వర్సెస్' రచించి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 2008లో 'ద ఎన్‌చాంట్రెస్ ఆఫ్ ఫ్లారెన్స్' తరువాత ఆయన మరో నవల రాయలేదు. కాగా, కొత్త నవలలో జానపద సాహిత్యం, చరిత్ర తదితరాలను నేపథ్యాలుగా ఆయన వినియోగించుకుంటున్నట్టు సమాచారం.