: పాకిస్థాన్ లోని షికార్ పూర్ లో బాంబు పేలుడు
పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్ లోని షికార్ పూర్ లో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 40 మందికి గాయాలయ్యాయని సమాచారం. ఇక్కడి మైనారిటీ షియా మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా పేలుళ్లు సంభవించాయని పోలీసులు చెబుతున్నారు. షికార్ పూర్ లోని లకీదార్ ప్రాంతంలో పేలుడు చోటుచేసుకుందని చెప్పారు. ఇంకా మిగతా వివరాలు వెల్లడికావాల్సి ఉంది. అయితే, ఇది ఆత్మాహుతి దాడి అని స్థానిక ప్రైవేట్ మీడియా అంటోంది.