: ఇక కేసీఆర్‌ సర్కారుపై దండయాత్ర: మంద కృష్ణ


దళితులను అడుగడుగునా అవమానిస్తున్న కేసీఆర్‌ సర్కారుపై దండయాత్ర చేయనున్నామని మంద కృష్ణ మాదిగ చెప్పారు. దీనికోసం రేపు కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. కేసీఆర్‌ మాల, మాదిగలను అవమానిస్తున్నారని, అగ్రకులాలకే మంత్రి పదవులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆయన మంత్రివర్గంలోని హరీష్‌ రావు, నాయిని తదితరులపై కూడా ఆరోపణలు వస్తే, వారిని వదిలి రాజయ్యను అన్యాయంగా బర్తరఫ్‌ చేశారని ఆయన విమర్శించారు. ఇప్పటికీ స్వైన్‌ ఫ్లూ మరణాలు సంభవిస్తున్నాయని, వీటికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News