: స్పైస్ జెట్ బోర్డుకు రాజీనామా చేసిన మారన్ కుటుంబం


మీడియా దిగ్గజం కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరి, దగ్గరి బంధువు ఎస్.నటరాజన్ లు స్పైస్ జెట్ బోర్డు డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారు. ఇటీవలే స్పైస్ జెట్ లో తమకున్న వాటాను వీరు అజయ్ సింగ్ కు విక్రయించిన సంగతి తెలిసిందే. కాగా, సంస్థలో కొత్త ఇన్వెస్టర్లు ముందు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రూ.100 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. మరో రూ.400 కోట్లను ఫిబ్రవరి 15లోగా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది. మార్చి 15న మరో రూ.500 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్ 30 నాటికి మరో రూ.500 కోట్లు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. దీనిలో మూడింట రెండు వంతులు ఈక్విటీ రూపంలో, మిగిలినది రుణం రూపంలో సంస్థకు ఆయన అందించనున్నారు. కాగా, మారన్ కుటుంబ సభ్యుల రాజీనామాల గురించి ఈ ఉదయం స్పైస్ జెట్ స్టాక్ మార్కెట్లకు వెల్లడించింది.

  • Loading...

More Telugu News