: వేదాంత, ఆదానీలకు అనుమతులివ్వొద్దని రాహుల్ చెప్పారు: కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పలు అంశాలకు సంబంధించి తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ప్రకటించారు. కర్మాగారాల ఏర్పాటు కోసం పారిశ్రామిక సంస్థలు వేదాంత, ఆదానీ గ్రూపులు చేసుకున్న దరఖాస్తులకు అనుమతి ఇవ్వొద్దని రాహుల్ గాంధీ తనకు చెప్పారని ఆమె పేర్కొన్నారు. అయితే, నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఆయన చెప్పినట్లు తాను వినలేదన్నారు. రాహుల్ మాట వినని కారణంగానే తనను పర్యావరణ శాఖ మంత్రి పదవి నుంచి తప్పించారని ఆమె ఆరోపించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తనను, ఆ పదవి నుంచి తప్పించిన అధిష్ఠానం... అందుకు గల కారణాలను మాత్రం నేటికీ చెప్పలేదని జయంతి వాపోయారు.