: కేసీఆర్ సీఎం కాదు... ఉద్యమకారుడే!: ఏపీ మంత్రి గంటా


తెలంగాణ సీఎం ఇంకా ఉద్యమకారుడిలా ప్రవర్తిస్తున్నారని ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఉన్నత విద్యా శాఖ బ్యాంకు ఖాతాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్తంభింపజేయడంపై ఆయన కొద్దిసేపటి క్రితం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిలో ఉన్నప్పటికీ కేసీఆర్ ఉద్యమకారుడి తరహాలో ప్రవర్తిస్తున్నారన్నారు. ఈ కారణంగా కేసీఆర్ ను సీఎంగా కాక ఉద్యమకారుడిగానే పరిగణించాల్సి వస్తోందని గంటా అన్నారు. బ్యాంకు ఖాతాను స్తంభింపజేసిన ఎస్బీహెచ్ పై పరువు నష్టం దావా వేస్తామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News