: కేసీఆర్ పై ధ్వజమెత్తిన జానారెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీ.కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పైరవీలు, పదవులు, కాంట్రాక్టుల కోసమే టీఆర్ఎస్ లో పలువురు నేతలు చేరుతున్నారన్నారని విమర్శించారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ముందు దళితులకు సీఎం పదవి కట్టబెడతానని చెప్పిన కేసీఆర్, ఆ తర్వాత మొండిచేయి చూపించారని మండిపడ్డారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని, వచ్చే నెలలో దళితులతో నిరసన సభలు నిర్వహిస్తామని జానా చెప్పారు.

  • Loading...

More Telugu News