: మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్యను వెనక్కు రమ్మని ఆదేశించలేము : హైదరాబాద్ హైకోర్టు


మరో వ్యక్తితో కలసి వున్న భార్యను తనకు అప్పగించేందుకు హెబియస్ కార్పస్ రిట్‌ జారీ చేయాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను విచారిస్తున్న సందర్భంగా హైదరాబాద్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తలు కలిసి కాపురం చేయాలని తాము ఆదేశించలేమని, ప్రైవేట్ వ్యక్తుల నిర్బంధంలో ఉన్న వారిని కోర్టులో హాజరుపరచాలని హెబియస్ కార్పస్ రిట్ ను జారీ చేయలేమని స్పష్టం చేసింది. తనను వదిలి మరొక వ్యక్తితో కాపురం చేస్తున్న భార్యను తన దగ్గరకు పంపించాలని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా, ఈ వ్యవహారం హెబియస్ కార్పస్ పరిధిలోకి రాదని కోర్టు చెప్పింది. భార్యా భర్తల కాపురంపై కోర్టులకు అధికారం లేదని వ్యాఖ్యానించింది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా వ్యక్తులను పోలీసులు అక్రమంగా నిర్బంధించిన సమయంలో మాత్రమే హెబియస్ కార్పస్ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకుంటామని ధర్మాసనం వెల్లడించింది.

  • Loading...

More Telugu News