: జమ్మూకాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం... సీఎంగా ముఫ్తీ, బీజేపీకి డిప్యూటీ సీఎం!


ఎన్నికల ఫలితాలు వెల్లడైన నెల తరువాత జమ్మూకాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారం పంచుకునే ఒప్పందంపై బీజేపీ, పీడీపీలు ఓ నిర్ణయానికొచ్చినట్టు తెలిసింది. పీడీపీ స్థాపకుడు ముఫ్తి మహ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా పిబ్రవరిలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారని సమాచారం. ఇక, ఉపముఖ్యమంత్రి పదవి బీజేపీ తీసుకుంటుండగా, అందుకు ఆ పార్టీ నేత నిర్మల్ సింగ్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. "పీడీపీతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు దాదాపు ఓ ఏకాభిప్రాయానికి వచ్చాం, త్వరలో జమ్ము కాశ్మీర్ లో ఉత్తమమైన రాజకీయనేత, మంచి క్యాబినెట్ జట్టుతో సమర్థవంతమైన ప్రభుత్వం ఏర్పడుతుంది" అని బీజేపీ బిల్వార్ ఎమ్మెల్యే నిర్మల్ సింగ్ తెలిపారు. మరోవైపు, పీడీపీ అధికార ప్రతినిధి నయిీం అక్తర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఫిబ్రవరి మధ్యలో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని చెప్పారు. కాగా, పీడీపీకి హోం, ఆర్థిక శాఖలు, బీజేపీకి ఉపముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్ పదవులు దక్కుతాయని తెలిసింది.

  • Loading...

More Telugu News