: విజయవాడ నుంచి తిరుపతికి ఏఐ విమాన సర్వీసు ప్రారంభం
విజయవాడ విమానాశ్రయం నుంచి మరో రెండు ఎయిరిండియా (ఏఐ) సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఏఐ నేటి ఉదయం 9:25కు తిరుపతికి సర్వీసును ప్రారంభించింది. ఈ విమానం ప్రతిరోజు ఉదయం 7.45కు హైదరాబాదులో బయలుదేరి 8.55 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి 9.25కు బయలుదేరి 10.45 గంటలకు తిరుపతి చేరుకుని, అరగంట విరామం తరువాత 11.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.05 గంటలకు బయల్దేరి 2.15 గంటలకు హైదరాబాదు చేరుకుంటుంది. ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం నుంచి ఏఐ న్యూఢిల్లీకి రెండు సర్వీసులను నడుపుతున్న సంగతి తెలిసిందే. స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్త సర్వీసులను ప్రారంభించినట్టు పేర్కొన్నారు.