: ఢిల్లీ పీఠం కేజ్రీవాల్ దేనట... రిలయన్స్ వెబ్ సైట్ ‘ఫస్ట్ పోస్ట్’లో కథనం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠిస్తారని ‘ఫస్ట్ పోస్ట్’ వెబ్ సైట్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ వెబ్ సైట్ భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నేతృత్వంలో నడుస్తోంది. దీంతో, ఈ వార్త ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులతో పాటు పారిశ్రామిక వర్గాల్లో కూడా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఊహిస్తూ ‘‘పాంచ్ సాల్ కేజ్రీవాల్: ఆమ్ ఆద్మీ పార్టీ మే బీ హెడెడ్ ఫర్ ఏ ల్యాండ్ స్లైడ్ విన్’’ పేరిట ఆ వెబ్ సైట్ ఈ కథనాన్ని రాసింది.