: వెయ్యి చిత్రాల రికార్డు బ్రేక్ చేసిన బ్రహ్మానందం


తన అద్భుతమైన అభినయంతో గత మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న సినీ నటుడు బ్రహ్మానందం 1000 చిత్రాల రికార్డును బ్రేక్ చేశారు. గతేడాది దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన 'ఎర్ర బస్సు' సినిమాతో ఈ మైలురాయిని దాటారు. ఇన్ని చిత్రాల తరువాత కూడా ఆయనింకా నవ్విస్తూనే ఉండటం తెలుగు సినీ అభిమానుల అదృష్టమనే చెప్పాలి. ఐదేళ్ల చిన్నారి నుంచి అరవైఏళ్ల వృద్ధుల వరకు వయసుతో నిమిత్తం లేకుండా బ్రహ్మీని చూడగానే నవ్వేస్తారంటే అతిశయోక్తి కాదు. ఇన్నేళ్లుగా ఎలా నవ్వించలుగుతున్నారని అడిగితే, 'ఎందుకని నన్నడగకండి!' అని ఈ నవ్వుల బ్రహ్మ అంటాడు. వెయ్యికిపైగా చేసిన సినిమాల గురించి ప్రస్తావిస్తే, ఇది కేవలం సంఖ్యేనని, తనకు మాత్రం 1000వ చిత్రానికి, పదకొండవ చిత్రానికి ఎలాంటి తేడా వుందని అంటున్నారు. అయితే, తన 1000వ చిత్రం ఏదో కూడా గుర్తులేదంటున్నారు. గతేడాది తన 997వ చిత్రం తరువాత నుంచి గుర్తుపెట్టుకోవడం వదిలేశానంటున్నారు. అన్నట్టు ఈ నవ్వుల రారాజు ఫిబ్రవరి 1న పుట్టినరోజు జరుపుకోబోతూ 59వ పడిలో అడుగుపెట్టబోతున్నారు.

  • Loading...

More Telugu News