: నచ్చిన స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకోవడం సరికాదు: కోహ్లీకి ధోనీ సూచన
జట్టు ప్రయోజనాల కోసం కొన్నిసార్లు త్యాగాలు చేయాల్సి ఉంటుందని, ఎప్పుడూ ఒకే స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకోవడం సరికాదని విరాట్ కోహ్లీకి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సూచించాడు. త్వరలో వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు జరగనున్న నేపథ్యంలో, కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్ పై ప్రశ్నలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. "తుది జట్టులో ఉండే 11 మందిలో ఎవరు ఎక్కడ ఆడినా, జట్టుకు లాభం కలగడం ముఖ్యం. అందువల్ల తనకు నచ్చిన స్థానంలో ఆడుతున్న ఆటగాడు ఒక్కోసారి త్యాగం చేయాల్సిరావచ్చు" అని ధోనీ అన్నాడు. కాగా, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన కోహ్లీ, వన్ డే సిరీస్ లో తొలి మూడు మ్యాచ్ లలో కేవలం 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో, కోహ్లీ పొజిషన్ పదేపదే మారుస్తూ ఉండటం పట్ల టీమ్ మేనేజ్ మెంట్ పై విమర్శలు పెరుగుతున్నాయి.