: లారీని ఢీకొట్టిన ‘దివాకర్’ వోల్వో బస్సు... ఐదుగురికి గాయాలు
తెలంగాణ పరిధిలో మరో వోల్వో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. నేటి ఉదయం నల్లగొండ జిల్లా కట్టంగూరు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న లారీని దివాకర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు ఢీకొట్టింది. దట్టమైన పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న లారీని గుర్తించలేకపోయానని బస్సు డ్రైవర్ చెప్పినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.