: కొచ్చిలో మావోయిస్టుల విధ్వంసం... పశ్చిమ కనుమల్లో గాలింపు ముమ్మరం
కేరళలోని భారత జాతీయ రహదారుల సంస్థ కార్యాలయంపై గురువారం మావోయిస్టులు దాడి చేశారు. కలమసేరి సమీపంలోని ఈ కార్యాలయంపై దాడి జరిగినట్లు కొచ్చి పోలీస్ కమిషనర్ వివరించారు. దుండగులు కార్యాలయంలోని దస్త్రాలకు నిప్పంటించారని, నక్సలిజానికి చెందిన కొన్ని కరపత్రాలు విడిచి వెళ్ళారని ఆయన తెలిపారు. కాగా, తెనమలై అటవీ ప్రాంతంలో ఒడిశాకు చెందిన మావోయిస్టు పోలీసులకు పట్టుబడడం చర్చనీయాంశమైంది. పశ్చిమ కనుమల్లో మిగిలిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు.