: చిరుత సంచారం... తాజాగా కర్నూలు జిల్లా వంతు!


మొన్న చిత్తూరు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి, నిన్న కడప జిల్లా వీరబల్లి మండలం సానిపాయ గ్రామం, తాజాగా కర్నూలు జిల్లా కోసిగి మండలం అర్లబండ గ్రామం... చిరుత పులుల సంచారంతో భయాందోళనలు నెలకొన్నాయి. దాదాపు పది రోజులుగా గ్రామ పరిసరాల్లో చిరుత పులి సంచరిస్తుండటంతో అర్లబండ గ్రామస్థులు తీవ్ర భయాందోళనల్లో పడిపోయారు. అటవీ ప్రాంతం నుంచి వచ్చేసిన సదరు చిరుత పులి ఇటీవలే గ్రామ సమీపంలో ఓ ఆవును చంపేసిందట. చిరుత పులి ఎప్పుడు తమ ఇళ్లపై పడుతుందోనన్న భయంతో క్షణమొక యుగంగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని చెబుతున్న గ్రామస్థులు, పులిని బంధించాలని అధికారులను కోరుతున్నారు.

  • Loading...

More Telugu News