: చావో... రేవో?: నేడు ఇంగ్లండ్ తో భారత్ మ్యాచ్!
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లో నేడు జరగనున్న వన్డే మ్యాచ్... ఇటు భారత్ కే కాక అటు ఇంగ్లండ్ కు కూడా కీలకం కానుంది. మ్యాచ్ లో విజయం సాధించే జట్టు సిరీస్ లో ఫైనల్ చేరుతుంది. ఇప్పటికే ఆతిథ్య జట్టు ఆసీస్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్ లో గెలిచి ఫైనల్ లో ప్రవేశించాలని ధోనీ సేన గట్టి పట్టుదలగా ఉంది. అయితే, సిరీస్ లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియాపై విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. మరోపక్క, సిరీస్ లో ఇప్పటిదాకా విజయాన్ని నమోదు చేయని ధోనీ సేన, ఈ మ్యాచ్ లో నైనా గెలిచి ఫైనల్ చేరాలని భావిస్తోంది.