: చార్లీహెబ్డో కార్టూన్ ప్రచురించిన ఉర్దూ పత్రిక ఎడిటర్ అరెస్టు
ఫ్రెంచ్ వ్యంగ్య పత్రిక చార్లీహెబ్డో కార్టూన్ ను పునఃప్రచురించిన థానేకి చెందిన ఉర్దూ పత్రిక ఎడిటర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అవథ్ నామా అనే ఉర్దూ పత్రిక ఎడిటన్ శిరిన్ ధాల్వీని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ పై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనకు తెలియకుండానే పత్రిక లోపలి పేజీల్లో కార్టూన్ పునఃప్రచురితమైందని అన్నారు. కాగా, ఆ కార్టూన్ కారణంగానే తీవ్రవాదులు ఫ్రాన్స్ లోని చార్లీహెబ్డో పత్రిక కార్యాలయంపై దాడికి తెగబడి ఉద్యోగులను హతమార్చిన సంగతి తెలిసిందే.