: మోదీ సూటు 10 లక్షలు...భారతీయులను మోసం చేశారు: రాహుల్ గాంధీ
విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామంటూ భారతీయులందర్నీ ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఒబామా భారత పర్యటన సందర్భంగా మోదీ వేసుకున్న సూట్ ఖరీదు అక్షరాలా పది లక్షల రూపాయలని అన్నారు. సూటు నిండా మోదీ తన పేరు కుట్టించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదనే లక్ష్యంతో పని చేస్తోందని ఆయన ఆరోపించారు.