: వచ్చే పదేళ్ల వరకు చంద్రబాబే సీఎం: చింతమనేని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పదేళ్ల వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడినే ప్రజలు ఎన్నుకుంటారని దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. దెందులూరులో రుణమాఫీ మొత్తాలను రైతులకు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త సంసారంలో ఇబ్బందులున్నట్టే కొత్త రాష్ట్రంలో కూడా ఇబ్బందులు ఉన్నాయని, అవి త్వరలోనే సర్దుకుంటాయని అన్నారు. రాష్ట్రంలో లోటుబడ్జెట్ ను చంద్రబాబు అధిగమిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.