: చేయి విరిగితే...వైద్యం చేతకాక...చేతిని తీసేశాడు


కడుపు కుడుతూ కత్తెర్లు మర్చిపోవడం వంటి వార్తలు అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం. బీహార్ లో ఓ వైద్యుడికి వైద్యం చేతకాక నాలుగేళ్ల చిన్నారి చేతిని తీసేసిన ఉదంతం వెలుగు చూసింది. నెవెడా జిల్లాలోని విశ్వన్ పూర్ గ్రామానికి చెందిన ఉదయ్ ప్రసాద్ నాలుగేళ్ల కుమార్తె అంచల్ కుమారికి జరిగిన ప్రమాదంలో ఎడమ చేయి విరిగి వాచింది. దీంతో వారు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాలికను చేర్చారు. అక్కడ బాలికకు అరవింద్ కుమార్ అనే వైద్యుడు చికిత్స అందించారు. నెలరోజులైనా బాలిక చేయి అతుక్కోకపోగా, వాపు కాస్తా ఇన్ ఫెక్షన్ కు దారితీసింది. విషయం గుర్తించిన డాక్టర్ బాలిక చేతిని తొలగించారు. జరిగినది గ్రహించి, అవాక్కైన చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. దీంతో విషయం వెలుగు చూసింది.

  • Loading...

More Telugu News