: కూలిన విమానాన్ని నడిపింది కోపైలట్!


జావా సముద్రంలో కూలిన విమానం ప్రమాద సమయంలో విమానాన్ని నడిపింది పైలట్ కాదని, కోపైలట్ అని ఇండోనేషియా అధికారులు తెలిపారు. అంతగా అనుభవం లేని కోపైలట్ విమానం నడపడంతోనే ప్రమాదం సంభవించిందని ఆ దేశ జాతీయ రవాణా భద్రతా కమిటీ అధికారి తెలిపారు. క్యూజెడ్ విమానం ప్రమాదం జరిగిన సమయంలో 32 వేల అడుగుల ఎత్తులో ఉందని తెలిపారు. 38 వేల అడుగుల ఎత్తులో ఎగరడానికి గ్రౌండ్ కంట్రోల్ అధికారులను పైలట్ అనుమతి కోరగా, వారు 34 వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరేందుకు అనుమతినిచ్చారని తెలిపారు. అయితే విమానం 38 వేల అడుగుల ఎత్తుకు వెళ్లిందని, తరువాత అకస్మాత్తుగా 24 వేల అడుగులకు పడిపోయిందని, ఆ క్షణంలోనే విమానం రాడార్ పై మాయమైందని వారు వెల్లడించారు. ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉండే 38 వేల అడుగులకు ఎందుకు వెళ్లిందనే విషయం అంతుబట్టడం లేదని, దీనిపై మరింత లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News