: మహిళా పోలీసులనే ఈవ్ టీజింగ్ చేసిన ఘనులు


ఆ యువకులకు తెలీదు, తమ ఎదురుగా ఉన్నది మహిళా కానిస్టేబుళ్ళని. కంటికి నదురుగా కనిపించారని ఈవ్ టీజింగ్ కు పాల్పడ్డారు. అసభ్యకరమైన వ్యాఖ్యలతో వేధించారు. ఎదురుతిరిగారని వారిని కొట్టారు కూడా. ఆనక కటకటాల వెనక్కి చేరారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఖటోలి పట్టణంలో ఇద్దరు మహిళా పోలీసులను వేధించిన కేసులో యోగేశ్, దీపక్, శావని అనే వ్యక్తులను అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఓ మహిళా కానిస్టేబుల్ గాయపడడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News