: ఆ బస్సులో ప్రయాణికులను కాపాడింది ఓ ఫోన్ కాల్


పర్వీన్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతి అయిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ప్రమాదం సమయంలో ప్రయాణికులను రక్షించింది ఓ ఫోన్ కాల్. పర్వీన్ ట్రావెల్స్ బస్సులోని చివరి వరుసలో కూర్చున్న శ్వేతా నటరాజన్ అనే యువతి నిద్రపోతున్న సమయంలో కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఆమెకు మెలకువ వచ్చింది. వెంటనే బస్సులో వెనుక నుంచి పొగలు రావడం ఆమె గమనించి, తోటి ప్రయాణికులను అప్రమత్తం చేసింది. దీంతో డ్రైవర్ బస్సు ఆపగానే వారంతా బస్సు దిగేశారు. వారు బస్సుదిగిన నిమిషాల్లోనే బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సుదిగిన ప్రయాణికులు వెనుక డిక్కీల్లో ఉన్న సామగ్రి తీసేలోపే అదంతా కాలి బూడిదైంది. దీంతో బంగారం, సర్టిఫికేట్లు కాలిపోయాయని కొత్తదంపతులు వాపోగా, ఉద్యోగం కోసం వెళ్తున్నవారు కూడా సర్టిఫికేట్లు కాలిపోయాయని బాధపడ్డారు. కాగా, ఈ ప్రమాదంలో 20 లక్షల రూపాయల విలువైన వస్తువులు బూడిదైపోయాయి. ఫోరెన్సిక్ నిపుణులు ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు వెల్లడిస్తే కానీ వాస్తవాలు తెలియవు. కాగా, బస్సులో పేలుడు వస్తువులు తరలిస్తున్నారని, అందువల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 38 మంది ఉన్నారు. వారి ప్రాణాలు ఓ ఫోన్ కాల్ కాపాడడం విశేషం.

  • Loading...

More Telugu News