: కోల్ ఇండియా షేర్ ధర 358


కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం వాటాలో 10 శాతాన్ని విక్రయానికి పెట్టనున్న సంగతి తెలిసిందే. కాగా, రేపే కోల్ ఇండియా షేర్లను కేంద్రం విక్రయించనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం రేపు ఉదయం 9 గంటలకు షేర్ల విక్రయం ప్రారంభమవుతుంది. ఒక్కో షేరు ధర 358 రూపాయలుగా నిర్ణయించారు. పది శాతం వాటా విక్రయం ద్వారా 22,611 కోట్ల రూపాయలు సమకూరనున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

  • Loading...

More Telugu News