: చంద్రబాబు వివరణ ఇవ్వాలి... లేకుంటే కోర్టుకెళతా: కడియం హెచ్చరిక


తెలంగాణ టీడీపీ నేతలపై ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పదవి రావడంతో టీడీపీ నేతలు ఈర్ష్య పడుతున్నారన్నారు. తన గురించి అత్యంత నీచంగా మాట్లాడుతున్నారని, ఇది తగదని సూచించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు తనపై చేసిన వ్యాఖ్యలను కడియం ఖండించారు. మోత్కుపల్లి చెప్పినట్టు తాను బైండ్ల సామాజిక వర్గానికి చెందిన వాడినేనని, తన బాల్యం నుంచి అదే కుల సర్టిఫికెట్ ఉందని వెల్లడించారు. తనది మాదిగ కులానికి ఉపకులమని, కానీ, తాను ఎస్సీని కాదనడం మాత్రం వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. అయితే, తాను తప్పుడు సర్టిఫికెట్ తో ప్రజలను మోసం చేస్తున్నానంటూ మోత్కుపల్లి ఆరోపించడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే తాను కోర్టుకు వెళతానని కడియం హెచ్చరించారు.

  • Loading...

More Telugu News