: గ్రీన్ టీ నోటి కేన్సర్ కి చెక్ చెబుతుంది!


గ్రీన్ టీ నోటి కేన్సర్ కి చెక్ చెబుతుందని పరిశోధకులు ఢంకా బజాయించి చెబుతున్నారు. మానవ శరీరంలోని కేన్సర్ కారకాలను నాశనం చేసే పదార్థాలు గ్రీన్ టీలో ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. అయితే, గ్రీన్ టీ ఆరోగ్యకరమైన కణాలను వదిలేసి కేన్సర్ కారకాలను మాత్రమే ఎందుకు నశించేలా చేస్తుందన్న దానిపై పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ మరింత విస్తృత పరిశోధనలు చేసింది. గ్రీన్ టీలోని ఈజీసీజీ అనే మూలకం కేన్సర్ కారకాలను నశింపజేసే ప్రక్రియను మైటోకాండ్రియాలో ప్రేరేపిస్తుందని నిర్ధారణ అయింది. గ్రీన్ టీ కారణంగా నోటి కేన్సర్ కి కారణమయ్యే కణాలు మాత్రమే నశిస్తాయని, ఇతర కణాలపై ఎలాంటి ప్రభావం ఉండదని వారు స్పష్టం చేశారు. దీంతో, మామూలు టీ స్థానంలో గ్రీన్ టీ తీసుకుంటే మరింత ఆరోగ్యంగా ఉండవచ్చని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News