: కేసీఆర్ ఆయనను అవమానకర రీతిలో తొలగించారు: మంద కృష్ణ మాదిగ


తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్యను కేసీఆర్ అవమానకర రీతిలో తొలగించారని ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మాదిగలకు అన్యాయం చేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. రాజయ్యకు జరిగిన అవమానంపై వరంగల్ లో శుక్రవారం సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కనీసం రాజయ్య వివరణ కూడా తీసుకోకుండా తొలగించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. వరంగల్ సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వంపై దండయాత్ర ప్రకటిస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News