: ఉస్మానియాలో 12 మంది జూడాలకు స్వైన్ ఫ్లూ లక్షణాలు


హైదరాబాదు ఉస్మానియా ఆసుపత్రిలో 12 మంది జూనియర్ డాక్టర్లు స్వైన్ ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవాలని వారికి అధికారులు సూచించారు. వారిని విధుల నుంచి మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అటు, గాంధీ ఆసుపత్రిలో నేడు ఇద్దరు వ్యక్తులు స్వైన్ ఫ్లూతో మరణించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 43 మంది స్వైన్ ఫ్లూ చికిత్స పొందుతున్నారు. వారిలో 10 మంది చిన్నారులున్నారు.

  • Loading...

More Telugu News