: వరల్డ్ కప్ ముంగిట టీమిండియాను వేధిస్తున్న ఐదు సమస్యలివే...1


ప్రపంచకప్ పోటీలకు టీమిండియా సన్నద్ధమవుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగుతున్న టీమిండియాను ఐదు ప్రధాన సమస్యలు వెంటాడుతున్నాయి. వరల్డ్ కప్ లో ఈ సమస్యలు పరిష్కారం కాకుంటే భారత జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టే ప్రమాదం లేకపోలేదు. ఓపెనింగ్ సమస్య అలాగే ఉంది. స్వదేశంలో చెలరేగే టీమిండియా ఓపెనర్లు, విదేశాల్లో చేతులెత్తేస్తున్నారు. కాగా, ధావన్ వరల్డ్ కప్ లో కూడా ఫాంలేమితో సతమతమైతే టీమిండియాకు ఇక్కట్లు తప్పనట్టే. మరో ఒపెనర్ రోహిత్ శర్మ అత్యుత్తమ ఫాంలో ఉన్నప్పటికీ గాయాల బెడద ఉండనే ఉంది. ధావన్ ఫాంలోకి వచ్చి, రోహిత్ గాయాలబారిన పడకుంటే టీమిండియా క్వార్టర్స్ ఆశలు పదిలంగా ఉంటాయి. రెండో సమస్య... కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్. టీమిండియాలో కీలక ఆటగాడైన కోహ్లీని ఏ స్థానంలో పంపాలో ధోనీకి స్పష్టత లేనట్టుంది. అందుకే అతని బ్యాటింగ్ స్థానంపై విశేషమైన ప్రయోగాలు చేస్తున్నాడు. నాలుగో నంబర్ ఆటగాడిగా కోహ్లీ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో, బ్యాటింగ్ ఆర్డర్లో కోహ్లీ స్థానం ఎక్కడ? అని సందేహం నెలకొంది. బౌలింగ్ లో భారత జట్టు పేలవంగా ఉంది. పేసర్లలో నిలకడ లోపించడంతో ధోనీ ఎక్కువగా స్పిన్ వైపు మొగ్గుచూపుతున్నాడు. ఫాస్ట్ పిచ్ లపై వరల్డ్ కప్ జరుగుతున్నందున అప్పటికి అందుబాటులో ఎవరుంటారన్నదానిపై స్పష్టత లేదు. పేసర్లు భువీ, ఇషాంత్ గాయాలతో బాధపడుతుండగా, జడేజా ఫిట్ నెస్ సమస్యగా మారింది. దీంతో ధోనీ ఆశలు పెట్టుకోవాల్సింది షమి, స్టూవర్ట్ బిన్నీ, అక్షర్ పటేల్, అశ్విన్ లమీదే. కాగా, ధోనీ స్క్వాడ్ లో కీలక ఆటగాళ్లైన జడేజా, రోహిత్, ఇషాంత్, భువనేశ్వర్ కుమార్ లు గాయాలతో సతమతమవుతుండగా, ఆటగాళ్ల ఫాం కూడా టీమిండియాకు ప్రతికూలంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే, టీమిండియా ఆటగాళ్ల అలసట. వరుసగా సిరీస్ లు ఆడుతూ, నెల రోజుల ముందు నుంచి ఆస్ట్రేలియాలో టీమిండియా ఆటగాళ్లు మకాం వేశారు. సుదీర్ఘకాలం స్వదేశానికి దూరంగా ఉండడంతో వారు సరైన ప్రదర్శన చేయగలరా? అనే సందేహం సగటు అభిమానిలో చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News