: బాత్రూం వీడియోపై లక్ష్మీ మీనన్ పోలీస్ కంప్లైంట్


తమిళ సినీ రంగంలో వరుస విజయాలతో జోష్ మీదున్న లక్ష్మీ మీనన్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె బాత్రూం సన్నివేశాలు అంటూ ఇంటర్నెట్ లో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. విషయం ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న లక్ష్మీ మీనన్ చెన్నైలో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఆ వీడియో తనది కాదని, తన ముఖాన్ని ఎవరో మార్ఫింగ్ చేసి పెట్టారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, ఆ వీడియోను పోర్న్ సైట్స్ నుంచి డిలీట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు, ఆ వీడియోను అప్ లోడ్ చేసిన వారిని వెతికే పనిలో పడ్డారు. అయితే, ఆ వీడియో ఇప్పటికే వాట్స్ యాప్ ద్వారా షేర్ అయ్యి డౌన్ లోడ్ కూడా అయినట్టు తెలుస్తోంది. దీనిపై లక్ష్మీ మీనన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను అప్రదిష్ఠపాలు చేసేందుకు ఎవరో పన్నిన పన్నాగమని ఆమె ఆరోపించింది. కాగా, అలాంటి అశ్లీల వీడియోలు అప్ లోడ్ చేయడం సరికాదని పేర్కొంది. కుంకీ సినిమాతో తమిళతెరకు పరిచయమైన లక్ష్మీ మీనన్ పాండియనాడు, నాన్ సిగప్పు, మంజాపై తదితర విజయవంతమైన సినిమాల్లో నటించింది. తెలుగబ్బాయి విశాల్ లవర్ గా తమిళనాట వార్తల్లో నిలిచింది. అయితే మూడో సినిమాలో విశాల్ తో నటించేందుకు అభ్యంతరం చెప్పింది. కార్తీతో ఆమె నటించిన కొంభన్ సినిమా విడుదల కావాల్సి ఉంది. తాను ప్రేమ వివాహం చేసుకుంటానని, తాను పెళ్లాడే వ్యక్తి సినీ రంగానికి చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేసిందీ సుందరి.

  • Loading...

More Telugu News