: మర్రి శశిధర్ రెడ్డి ఉన్న చోటల్లా విధ్వంసమే: దానం


కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ విభాగం అధ్యక్షుడు దానం నాగేందర్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. శశిధర్ రెడ్డి ఉన్న చోటల్లా విధ్వంసమేనని అన్నారు. విభజించి పాలించాలని ఆయన భావిస్తున్నారని మండిపడ్డారు. వారానికొకసారి కనపడే శశిధర్ రెడ్డి సనత్ నగర్ ఉప ఎన్నిక కోసమే బయటికొచ్చారని ఆరోపించారు. ఇక, కాంగ్రెస్ పార్టీని వీడనని దానం స్పష్టం చేశారు. గ్రేటర్ అధ్యక్షుడికి చెప్పకుండా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సబబుకాదని పీసీసీ చీఫ్ పొన్నాలకు చెప్పానని అన్నారు. తాను కావాలో, వద్దో తేల్చుకోవాలని పొన్నాలకు స్పష్టం చేశానని ఈ మాజీ మంత్రి వివరించారు.

  • Loading...

More Telugu News