: వరల్డ్ కప్ ఫైనల్లో 'సూపర్ ఓవర్'
టీ20 ఫార్మాట్లో 'సూపర్ ఓవర్' గురించి తెలిసిందే. స్కోర్లు సమమైతే 'సూపర్ ఓవర్' తో విజేతను నిర్ణయిస్తారు. ఈ 'సూపర్ ఓవర్' ను వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ ప్రవేశపెట్టాలని ఐసీసీ నిర్ణయించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ టోర్నీ టైటిల్ సమరంలో ఒకవేళ స్కోర్లు సమమై మ్యాచ్ టై అయితే ఈ 'సూపర్ ఓవర్' అమలు చేస్తారు. తద్వారా విజేత ఎవరో తేలిపోతుందని ఐసీసీ భావిస్తోంది. దుబాయ్ లో జరిగిన ఐసీసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.