: పాస్ పోర్టుల జారీలో హైదరాబాదు కార్యాలయం రికార్డు: దేశంలోనే తొలి స్థానం కైవసం
హైదరాబాదులోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక సంఖ్యలో పాస్ పోర్టులను జారీ చేసి తొలి స్థానంలో నిలిచింది. ఈ మేరకు రికార్డు స్థాయిలో పాస్ పోర్టులను జారీ చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచామని కొద్దిసేపటి క్రితం హైదరాబాదు ప్రాంతీయ పాస్ పోర్టు అధికారిణి అశ్విని సత్తారు ప్రకటించారు. గతేడాది 6.95 లక్షల పాస్ పోర్టులను జారీ చేశామని ఆమె తెలిపారు. 2013 ఏడాదితో పోలిస్తే, గతేడాది పాస్ పోర్టుల జారీలో 13 శాతం వృద్ధి నమోదైందన్నారు. ఈ ఏడాది నవంబర్ 24 తర్వాత చేతిరాతతో కూడిన దరఖాస్తులను స్వీకరించబోమన్న ఆమె, 20 ఏళ్ల క్రితం జారీ అయిన పాస్ పోర్టులను మార్చుకోవాలని కోరారు.