: అమెజాన్.కామ్ నుంచి ఈ-మెయిల్ సర్వీస్


కార్పొరేట్ ఖాతాదారులను ఆకర్షించేందుకు అమెజాన్.కామ్ వెబ్ సైట్ తన ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఈ-మెయిల్, షెడ్యూల్ సర్వీస్ ను తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ లకు పోటీగా తమ మెయిల్ సర్వీస్ ఉంటుందని తెలిపింది. 'అమెజాన్ వర్క్ మెయిల్' పేరుతో రెండవ త్రైమాసికంలో ఈ సర్వీస్ ను లాంచ్ చేయనున్నట్టు చెప్పింది. కంపెనీ క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) దానిని అభివృద్ధి చేయనున్నట్టు వివరించింది. అమెజాన్ ప్రయత్నాలను హైలైట్ చేస్తూ లక్షలాది సంస్థలను ఒప్పించేవిధంగా సర్వీస్ ఉంటుందని పేర్కొంది. కార్పొరేట్ ఖాతాదారులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఈ-మెయిల్ సర్వీస్ టూల్ ను తీసుకురావడం తొలి దశ అని కంపెనీ విశ్లేషకులు అంటున్నారు. ఉదాహరణకు... గూగుల్ ఈ-మెయిల్ సేవలే కాకుండా క్యాలెండర్స్, ఫైల్ షేరింగ్, వీడియో కాన్ఫరెన్స్ వంటి ఎన్నో ఇతర సౌకర్యాలను కల్పిస్తోంది. ఇప్పుడు అమెజాన్ కూడా అదే తరహాలో కార్పొరేట్ సంస్థలను ఆకట్టుకునేందుకు రంగంలోకి దిగింది.

  • Loading...

More Telugu News