: ‘రాజధాని’ భూముల్లో పంటలొద్దనడంపై వైసీపీ ఎమ్మెల్యే వినూత్న ఆందోళన... పూలు కోసి నిరసన!
నవ్యాంధ్ర రాజధాని కోసం సేకరించిన భూముల్లో ఇకపై సాగు కుదరదన్న చంద్రబాబునాయుడు సర్కారు నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యే వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రాజధాని పరిధిలోని కురగల్లు, నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో నేటి ఉదయం పర్యటించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పొలాల్లో పూలు కోసి ప్రభుత్వానికి తన నిరసన తెలిపారు. రాజధాని కోసం సేకరించిన భూముల్లో ఇకపై పంటల సాగు కుదరదని నిన్న సీఆర్డీఏ ప్రత్యేక కమిషనర్ శ్రీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణం ప్రారంభమయ్యే దాకా పంటలు సాగు చేస్తే వచ్చే నష్టమేమిటన్న రీతిలో ఎమ్మెల్యే ఈ వినూత్న నిరసనకు దిగారు.