: పాలన గాలికొదిలేసిన చంద్రబాబు విమానాల్లో చక్కర్లు కొడుతున్నారు: రోజా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెబుతున్న బాబు... మరోవైపు ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరగడం అవసరమా? అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారని ఆరోపించారు. అటు, పాలన గాలికి వదిలేసి రాజధాని భూముల చుట్టూ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. అనంతపురంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ఉన్న పరువును, గుర్తింపును కుక్కలు చింపిన విస్తరి చేశారని మండిపడ్డారు. రాయలసీమకు గుండెకాయలాంటి హంద్రినీవాను త్వరితగతిన పూర్తి చేయాలని రోజా డిమాండ్ చేశారు.