: వెంకన్నను దర్శించుకున్న మ్యూజిక్ డైరక్టర్ కోటి
టాలీవుడ్ సీనియర్ మ్యూజిక్ డైరక్టర్ కోటి తిరుమల విచ్చేశారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం, ఆయనకు టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అటు, కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలా కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆయనకు జేఈఓ శ్రీనివాసరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం గవర్నర్ కు తీర్థప్రసాదాలు అందజేశారు.