: 'ట్విట్టర్ మొబైల్ వీడియో కెమెరా' ఉపయోగించిన తొలి భారతీయుడిగా షారుక్ ఖాన్
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో అందరి కంటే ముందుంటాడు. తాజాగా 'ట్విట్టర్ మొబైల్ వీడియో కెమెరా' ఫీచర్ ను ఉపయోగించిన తొలి భారతీయుడిగా షారుక్ మరో అడుగు ముందుకేశాడు. ఈ మేరకు ట్విట్టర్ మార్కెట్ డైరెక్టర్ రిషి జైట్లీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. "ట్విట్టర్ ఎప్పుడూ కొత్త ఫీచర్స్ ను తీసుకొస్తుంటుంది. అలాగే వారికి నేను చేసిన సూచనలను పరిశీలిస్తామన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ట్విట్టర్ మొబైల్ వీడియో కెమెరా ఫీచర్ చాలా కొత్తగా ఉంది. అప్పుడప్పుడూ దాన్ని ఉపయోగిస్తూ ఎంజాయ్ చేస్తా" అని కింగ్ ఖాన్ పేర్కొన్నాడు. ఇటీవలే ఈ ఫీచర్ ను తీసుకొస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది.