: పులివెందులలో టీడీపీ దీక్ష... జగన్ దీక్షకు నిరసనగా తెలుగు యువత నిరసన


వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న కడప జిల్లా పులివెందులలో టీడీపీ నేతలు దీక్షకు శ్రీకారం చుట్టారు. అది కూడా వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షకు నిరసనగానట. రాష్ట్ర రాజకీయ యవనికలో ఆది నుంచి పులివెందులలో వైఎస్ కుటుంబం హవా కొనసాగుతూనే ఉంది. 2009 దాకా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన మరణం తర్వాత ఆయన సతీమణి విజయమ్మ, తాజా ఎన్నికల్లో జగన్ పులివెందులకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం రేపు జరగనున్న జగన్ దీక్షకు నిరసనగా టీడీపీ యువజన విభాగం తెలుగు యువత నేతలు నేటి ఉదయం పులివెందుల తహశీల్దార్ కార్యాలయం ముందు దీక్ష ప్రారంభించారు. పులివెందులలో తెలుగు యువత దీక్ష నేపథ్యంలో పోలీసు వర్గాలు అప్రమత్తమయ్యాయి.

  • Loading...

More Telugu News