: బిజీగా ఉన్నా... రేపు కలవండి!: కూకట్ పల్లి ఎమ్మెల్యేతో చంద్రబాబు
టీడీపీ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ ఉదయం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కలిసేందుకు రాగా, నిరాశ ఎదురైంది. తాను బిజీగా ఉన్నానని, రేపు రావాలని చంద్రబాబు ఎమ్మెల్యేకి సూచించారు. మాధవరం సైకిల్ దిగి కారెక్కనున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడేందుకు నిరాకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, చంద్రబాబు నివాసం వెలుపల మాధవరం మీడియాతో మాట్లాడుతూ, 26 కులాలను బీసీ జాబితాలో చేర్చితే టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆ కులాలను తెలంగాణ సర్కారు బీసీ జాబితా నుంచి తొలగించడం తనకు నచ్చలేదని అన్నారు.