: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ పరీక్షలు రాసే అవకాశం కోల్పోనున్న తెలంగాణ విద్యార్థులు?


తెలంగాణలో ఇంటర్ పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు షాక్ తగిలింది. వీరు ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ పరీక్షలు రాసే అవకాశం కోల్పోతున్నట్టు సమాచారం. అసలేం జరిగిందంటే... రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేక ఇంటర్ బోర్డును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, ఈ విషయం గురించి సీబీఎస్ఈకి టీఎస్ ప్రభుత్వం సమాచారం అందించలేదు. కేంద్ర ప్రభుత్వం వద్ద కేవలం ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు అని మాత్రమే ఉందట. దీంతో, టీఎస్ ఇంటర్ బోర్డుకు సీబీఎస్ఈ వద్ద గుర్తింపు లేదని సమాచారం. ఈ నేపథ్యంలో, సదరు పరీక్షలు రాయాలనుకుంటున్న తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే సదరు పరీక్షల నిర్వహణకు సీబీఎస్ఈ చర్యలు చేపట్టింది. జరిగిన పొరపాటును గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆగమేఘాలపై నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది.

  • Loading...

More Telugu News