: యోగానందంలో ఏపీ సర్కారు... నేటి నుంచి మంత్రులు, ఉన్నతాధికారులకు యోగా క్లాసులు


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు యోగా మంత్రం పఠిస్తున్నారు. తానే కాక తన ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు కూడా యోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాక పనితీరును కూడా మెరుగుపరచుకోవాల్సిందేనని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంతటితోనే సరిపెట్టని చంద్రబాబు, ఏకంగా మంత్రులు, సీనియర్ అధికారులకు ప్రత్యేకంగా యోగా తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. తరగతుల నిర్వహణ బాధ్యతను ఈషా ఫౌండేషన్ కు అప్పగించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాదులో కొనసాగే తొలి విడత యోగా తరగతులకు మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు హాజరుకానున్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ నేతృత్వంలోని ఈషా ఫౌండేషన్ కు చెందిన వంద మంది వలంటీర్లు... మంత్రులు, అధికారులకు యోగాసనాలపై శిక్షణ ఇవ్వనున్నారు. మలి విడతలో ఎమ్మెల్యేలకూ యోగాలో శిక్షణ ఇప్పించాలని చంద్రబాబు సర్కారు యోచిస్తోంది.

  • Loading...

More Telugu News