: కడప జిల్లాలో జనావాసాల్లోకి చిరుత... భయాందోళనల్లో సానిపాయి గ్రామస్తులు
కడప జిల్లా వీరబల్లి మండలం సానిపాయిలో నేటి ఉదయం చిరుత పులిని చూసిన గ్రామస్తులు ఉరుకులు పరుగులు పెట్టారు. అరణ్యంలో ఉండాల్సిన చిరుత పులి గ్రామంలోకి వచ్చేసింది. అక్కడ ఏకంగా ఓ చెట్టుపైకి ఎక్కికూర్చుంది. నేటి ఉదయం చెట్టుపై చిరుతను చూసిన గ్రామస్తులు బెంబేలెత్తిపోయారు. వెనువెంటనే అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన గ్రామానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుత పులిని బంధించేందుకు చర్యలు ప్రారంభించారు.