: భార్య కేంద్ర మంత్రి... భర్త రాష్ట్ర మంత్రి: ఏపీ కేబినెట్ లోకి పరకాల?


కేంద్రంలో నరేంద్ర మోదీ కేబినెట్ లో కీలకమైన వాణిజ్య శాఖను నిర్మలా సీతారామన్ నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త పరకాల ప్రభాకర్ కూడా ప్రస్తుతం ఏపీలో సమాచార సలహాదారుగా కీలక పదవిలోనే ఉన్నారు. అయితే, పరకాలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇందుకనుగుణంగా ఆయనను శాసనమండలికి పంపేందుకు చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో పరకాలను బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారట. అంతకుముందే పరకాలను తన కేబినెట్ లోకి తీసుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నారని టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదే జరిగితే, భార్య కేంద్ర మంత్రిగా ఉంటే, భర్త రాష్ట్ర మంత్రిగా కొనసాగనున్న వైనాన్ని మనం చూడచ్చు.

  • Loading...

More Telugu News