: ఇక సర్కారీ షేర్లు... కోల్ ఇండియాలో పది శాతం వాటా విక్రయానికి రంగం సిద్ధం!


ప్రైవేట్ కంపెనీల షేర్లతో విసుగెత్తిపోయిన మదుపరులకు సర్కారీ షేర్లు కొత్త ఉత్సాహాన్ని నింపనున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని ప్రభుత్వ వాటాల విక్రయంపై నరేంద్ర మోదీ సర్కారు వేగం పెంచింది. ఈ క్రమంలో కోల్ ఇండియాలో 10 శాతం వాటా విక్రయానికి రేపు తెర లేవనుంది. రెండు విడతలుగా విక్రయానికి రానున్న ఈ వాటా విక్రయం ద్వారా రూ.24 వేల కోట్ల మేర నిధులను రాబట్టాలని ప్రభుత్వం భావిస్తుండగా, మదుపరులకు నికర లాభాలిచ్చే కంపెనీ షేర్లు అందుబాటులోకి రానున్నాయి. రేపు మార్కెట్లు ప్రారంభం కాగానే ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల మధ్య కోల్ ఇండియా షేర్ల విక్రయం కొనసాగుతుంది. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిన నేరుగా స్టాక్ మార్కెట్లో షేర్లను వేలం ద్వారా విక్రయించనున్నట్లు కోల్ ఇండియా యాజమాన్యం తెలిపింది. షేర్లలో 20 శాతాన్ని రిటైల్ కొనుగోలుదారులకు కేటాయిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. బిడ్డింగ్ ధరలో 5 శాతం డిస్కౌంట్ ను కూడా అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News