: ఎర్రచందనం రెండో విడత వేలానికి రంగం సిద్ధం... ఏపీ ఖజానాకు మరో రూ.1,000 కోట్లు!
ఎర్రచందనం వేలంలో భాగంగా తొలి విడతలో ఊహించిన దాని కంటే మెరుగైన రాబడితో ఉబ్బితబ్బిబ్బయిన ఏపీ సర్కారు, రెండో విడత వేలానికి రంగం సిద్ధం చేసింది. ఫిబ్రవరి రెండో వారంలో జరగనున్న రెండో విడత వేలానికి దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ విడతలో నాలుగు వేల టన్నుల మేర ఎర్రచందనాన్ని విక్రయించనున్నామని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెబుతున్నారు. తద్వారా సర్కారీ ఖజానాకు మరో రూ.1,000 కోట్లు జమ అయ్యే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. తొలి విడత వేలంలో మూడు వేల టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించిన ఏపీ సర్కారు, దాని ద్వారా రూ.900 కోట్లకు పైగా ఆదాయాన్ని రాబట్టిన సంగతి తెలిసిందే.